బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (11:25 IST)

మంత్రి రోజా బాక్సింగ్ ఫోటోలు.. నెట్టింట వీడియో వైరల్

RK Roja
RK Roja
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో బాక్సింగ్‌ నేషనల్‌ ఛాంపియన్‌ పోటీలను ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా ప్రారంభించారు.

విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్‌లో అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం మంత్రి రోజా బాక్సింగ్‌లో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. 
 
మంత్రి రోజా బాక్సింగ్ ఆడుతున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. జగనన్న స్వర్ణోత్సవాల్లో మంత్రి రోజా చురుగ్గా పాల్గొని కళాకారుల్లో ఉత్సాహం నింపుతున్న సంగతి తెలిసిందే. ఆమె డ్యాన్స్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.