గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2022 (14:00 IST)

ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య

hang
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. పలువురు చిన్నారులను అనాథలను చేస్తున్నాయి. కొందరు మహిళలు తమ పిల్లలు, కుటుంబం, పరువు ప్రతిష్ట అనేవి చూడకుండా తాము వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తులతో లేచిపోతున్నారు. తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపటలో ఓ వివాహిత, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల‌ పెన్‌పాడ్ గ్రామానికి చెందిన లావణ్య (28) అనే మహిళకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చింతపల్లి మహేశ్ (25)తో మూడేళ్ల క్రితం అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయటకు తెలియడంతో కులపెద్దలు పంచాయతీ నిర్వహించి, ఇద్దరినీ మందలించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి వీరిద్దరూ కనిపించకుండా పోయారు. భార్య లావణ్య కోసం సాయంత్రం వరకు వెతికినా జాడ కనిపించలేదు. దీంతో ఆమె భర్త శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి లొకేషన్‌ను గుర్తించారు. మొబైల్ లొకేషన్ సహాయంతో కుటుంబ సభ్యులు, పోలీసులు కలిసి మహేశ్ సాగు చేసే పొలాల వద్దకు వెళ్లి పరిశీలించగా, అక్కడు వారిద్దరూ విగత జీవులుగా కనిపించారు. వీరిద్దరూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.