శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (18:24 IST)

సాధారణ అమ్మాయిలా వైకాపా మహిళా ఎంపీ వివాహం (video)

వైకాపా పార్లమెంట్ మహిళా సభ్యురాలు గొట్టేటి మాధవి. అరకు లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈమె వివాహం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు జరిగింది. అదీ కూడా సాదాసీదాగా జరిగాయి. ఒక సాధారణ అమ్మాయిలా ఆమె పెళ్లి చేసుకున్నారు. 
 
ఇప్పటికే గొట్టేటి మాధవి రికార్డు సృష్టించారు. అతిచిన్న వయసులోనే పార్లమెంట్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇపుడు ఓ సాదాసీదా అమ్మాయిలా తన చిన్ననాటి స్నేహితుడుని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ జిల్లాలోని ఆమె స్వగ్రామం చెరబన్నపాలెంలో జరిగింది. 
 
ఆమె చిన్ననాటి స్నేహితుడు సెయింట్ అరెజా కాలేజ్ కరస్పాండెంట్ కుసిరెడ్డి శివప్రసాద రెడ్డిని ఆమె పెళ్లి చేసుకున్నారు. వైసీపీ అధికారులు, నాయకులు, ఇతర ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. వీరి వివాహ రిసెప్షన్ వైజాగ్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. 
 
కాగా, గొట్టేటి మాధవి పాఠశాల ఉపాధ్యాయురాలిగా తన ప్రస్థానం ప్రారంభించారు. అయితే గత ఎన్నికల్లో అరకు లోక్‌‌సభకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రాజకీయ ఉద్దండుడు, కేంద్ర మాజీ మంత్రి సునీల్ డియోరాను ఓడించి చరిత్ర సృష్టించారు.