అమ్మోరు ఆలయంలో తాళికట్టాడు.. రాత్రి శోభనం చేశాడు... ఉదయానికి పరార్

ఠాగూర్| Last Updated: శనివారం, 12 అక్టోబరు 2019 (11:07 IST)
శ్రీకాకుళం జిల్లాలో ఓ యువతి మోసపోయింది. ప్రేమిస్తున్నానని వెంటపడి పెద్దలను నమ్మించి పెళ్లి చేసుకున్న ఆ యువకుడు.. రాత్రికి శోభనం తంతు ముగించాడు. ఆ తర్వాత ఉదయానికి పత్తాలేకుండా పారిపోయాడు. దీంతో ఆ యువతి బోరున విలపిస్తోంది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో వెలుగు చూసింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ సైకిలుపై కాలేజీకి వెళ్లి వస్తున్న బాలికను చూసిన అదే గ్రామానికి చెందిన యువకుడు వెంకటేశ్ ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుందామంటూ నాలుగు నెలలుగా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో బాలిక తన తాత గారి ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్... బాలిక వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. ఆ తర్వాత గ్రామ శివారుల్లో ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లి తాళి కట్టాడు. రాత్రికి ఇద్దరూ అక్కడే గడిపారు.

అయితే, ఉదయం లేచి చూసేసరికి వెంకటేశ్ కనిపించకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేడు ఇరు వర్గాలను పిలిపించి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.దీనిపై మరింత చదవండి :