శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 11 ఆగస్టు 2017 (19:12 IST)

ఏపీ శాసనసభలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

అమరావతి : శాసనసభలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయం 6వ బ్లాక్ శాసనసభ భవనంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ ఉదయం 8.15 గంటలకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు జాతీయ జెండాను

అమరావతి : శాసనసభలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయం 6వ బ్లాక్ శాసనసభ భవనంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ ఉదయం 8.15 గంటలకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. శాసనస మండలిలో మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఉదయం 7.45 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.