బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (21:16 IST)

మరో వివాదంలో బీఆర్ నాయుడు.. తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఓవైసీ

asaduddin owaisi
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరో వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తొంది. ఆయన టీటీడీలో ఉన్న అన్యమతస్థులను ఇతర డిపార్ట్‌మెంట్‌లకు సర్దుబాటు చేస్తామంటూ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి సేవల్లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా, హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘూటుగా స్పందించారు. 
 
తిరుమల ఎవడి సోమ్మంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ కేంద్రంలో తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ కౌన్సిల్ లో హిందువేతరులకు కూడా చోటు కల్పిస్తు బిల్లు తీసుకొచ్చారన్నారు. హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు.
 
ఒక వేళ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్‌లో హిందువేతరులకు అవకాశం ఇచ్చినట్లు, టీటీడీలో కూడా ఇతరులు ఉంటే మీకు ఏంటని అన్నారు. ముస్లింలకు ఒక న్యాయం, హిందువులకు మరోక న్యాయమా అంటూ కూడా మీడియా సమావేశంలో కేంద్రంలోని మోదీ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు.