సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (09:01 IST)

ఆశా వర్కర్ ఎంత పనిచేసింది.. కుర్ కురే ప్యాకెట్‌లో ఎలుకల మందు కలిపి?

''ఆశా'' వర్కర్ ఓ చిన్నారి మృతికి కారణమైంది. ఆరోగ్య సలహాలు ఇవ్వాల్సిందిపోయి.. ఓ పిల్లాడికి కుర్‌కురే ప్యాకెట్‌లో ఎలుకలమందు కలిపి ఇచ్చి అతడి మృతికి కారణమైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పిడతపూడిలో ఈ

''ఆశా'' వర్కర్ ఓ చిన్నారి మృతికి కారణమైంది. ఆరోగ్య సలహాలు ఇవ్వాల్సిందిపోయి.. ఓ పిల్లాడికి కుర్‌కురే ప్యాకెట్‌లో ఎలుకలమందు కలిపి ఇచ్చి అతడి మృతికి కారణమైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పిడతపూడిలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పిడతపూడి గ్రామానికి చెందిన సుధాకర్‌, సంధ్య దంపతుల రెండో కుమారుడు ధనుంజయ్‌‌కు నాలుగేళ్లు. అతను స్థానిక అంగన్‌వాడీ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. 
 
అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లిన ఆ పిల్లాడికి అదే గ్రామానికి చెందిన ధనుంజయ్‌ బంధువు, ఆశా కార్యకర్త జ్యోతి ఎలుకల మందు కలిపిన కుర్ కురే ప్యాకెట్ ఇచ్చింది. దాన్ని తిన్న ధనుంజయ్‌ అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంటుండంతో సహచర విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. సాయంత్రానికి కూడా వాంతులు తగ్గకపోవడంతో చికిత్స నిమిత్తం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. అక్కడ వైద్యసేవలు పొందుతూ ధనుంజయ్‌ ప్రాణాలు కోల్పోయాడు.  
 
ఆశా వర్కర్‌పై బాలుడి తల్లిదండ్రులు చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశా వర్కర్‌ జ్యోతి ఎలుకల మందు కలిపిన కుర్‌కురే తినిపించడం వల్లనే ధనుంజయ్‌ మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రెండేళ్ల కిందట సుధాకర్‌, సంధ్యల పెద్ద కుమారుడుకు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే చనిపోయాడు. అప్పట్లో ఆశా వర్కర్‌ జ్యోతి అన్నం పెట్టిన తర్వాతే అస్వస్థతకు గురై మరణించాడు. ఈ నేపథ్యంలో తమ పెద్ద కుమారుడి మరణానికి కూడా జ్యోతినే కారణమైవుంటుందని సంధ్య దంపతులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.