బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 మార్చి 2018 (18:36 IST)

పవన్ గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు: అశోక్ గజపతి రాజు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అశోక్ గజపతి రాజు అన్నారు. గతంలో కూడా పవన్ కల్యాణ్ ఎవరో తెలీదంటూ అ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అశోక్ గజపతి రాజు అన్నారు.

గతంలో కూడా పవన్ కల్యాణ్ ఎవరో తెలీదంటూ అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన అశోక్ గజపతి రాజు.. తాజాగా పవన్ గురించి ఇక మాట్లాడకుండా మిన్నకుండిపోవడం మంచిదన్నారు. 
 
ఎన్డీఏ నుంచి టీడీపీ ఏకపక్షంగా బయటకు వెళ్లిందనడం సరికాదని అశోక్ గజపతి రాజు చెప్పారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా లేఖపై స్పందించిన అశోక్ గజపతి రాజు.. ఏపీ సమస్యలపై ఎన్నోసార్లు కేంద్రానికి తెలిపినా స్పందన లేదని, బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం వల్లే బయటికి వచ్చామని చెప్పారు. అలాగే పోలవరం నిర్వాసితులకు రాష్ట్రమే పరిహారం చెల్లించాలనుకోవడం అవివేకమని.. రాష్ట్ర విభజన చేసి ఏపీని అప్పుల ఊబిలో తోసేశారని వివరించారు.