ఏపీలో శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం, ఎందుకు, ఏమైంది?

suicide
మోహన్| Last Modified శుక్రవారం, 29 మే 2020 (18:48 IST)
అనంతపురం కలెక్టరేట్ ఆవరణలో ఓ శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రమణ అనే వ్యక్తి ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు.

కలెక్టరేట్ ఆవరణలోనే శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు పని చేసే తోటి సిబ్బంది ఆయనను వెంటనే సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. కాగా కుటుంబ కలహాలతో ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనాతో పోరాడేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్‌ను ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ఉపయోగించడం చర్చనీయాంశమైంది.దీనిపై మరింత చదవండి :