మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (20:32 IST)

పేకాడుతూ దొరికిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు

చిత్తూరు జిల్లా పలమనేరులోని లాడ్జిలో మంగళవారం పేకాట ఆడుతూ ఓ ఏఎ్‌సఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న వీరు.. భోజన విరామ సమయంలో యూనిఫాంలోనే పేకాటాడుతూ దొరికిపోయారు.

వీరి నుంచి స్థానిక పోలీసులు 9014 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొరికింది తమవారే కావడంతో తొలుత ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు బయటికి పొక్కకుండా చూసినప్పటికీ ‘విలేఖరులు’ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత చర్యలకు ఉపక్రమించారు. కేసు నమోదు చేసి నిందితులను స్వాధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం.