బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 27 మార్చి 2021 (18:08 IST)

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికే కన్నం

గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భక్తుల ముసుగులో లోపలికి వెళ్ళిన దొంగ ఆలయం లోపలి ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఏకాంత సేవ పూర్తయిన తర్వాత టిటిడి సిబ్బంది మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత దొంగ తమ చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది.
 
తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్ళిన టిటిడి సిబ్బంది హుండీతో పాటు వస్తువులు చిందర వందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్‌తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
గోవిందరాజస్వామి ఆలయం లోపల ప్రస్తుతం టిటిడి విజిలెన్స్‌తో పాటు పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్‌ను  పరిశీలిస్తున్నారు. నిందితుడు పాత నేరస్థుడిగా నిర్థారించుకున్నారు. అయితే ఆలయం నుంచి ఏం దొంగతనం చేశాడన్న విషయాన్ని టిటిడి అధికారులు నిర్థారించలేదు.