బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (07:14 IST)

ఏపీ రాజధాని పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభం

అమరావతికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం రోజు వారీ విచారణ ప్రారంభమైంది. అనుబంధ పిటిషన్లు అన్నీ కలుపుకుని, మొత్తం 230 పిటీషన్ల దాకా అవ్వగా, వాటిని 18 క్యాటగిరీలుగా విభజించింది హైకోర్టు. అన్ని పిటీషన్ల పై స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది. 
 
సీఆర్డీఏ రద్దు బిల్లు పై వేసిన పిటీషన్ పై స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం వెల్లడించింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు పై వేసిన పిటీషన్ పై స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం వెల్లడించింది. 
 
అమరావతిలో ఉన్న సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్, పోలీస్, ఇతర పరిపాలనా భవనలు, వైజాగ్ కి షిఫ్ట్ చేస్తున్నారు అనే పిటీషన్ తో పాటుగా, సియం క్యాంప్ ఆఫీస్ కు వైజాగ్ కి షిఫ్ట్ చేస్తున్నారు అనే పిటీషన్ ను కలిపి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనెరల్ మాట్లాడుతూ, సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్, ఇతర పరిపాలనా భవనలు, వైజాగ్ కి షిఫ్ట్ చేసే ఆలోచన లేదని చెప్పారు.

అలాగే ఇప్పటికే గ్రేహౌండ్స్ విశాఖలో ఉందని, వివిధ కార్పొరేషన్లు రాష్ట్రమంతా ఉన్నాయని, అయితే సియం క్యాంప్ ఆఫీస్ మాత్రం, ఎక్కడైనా పెట్టుకునే హక్కు ఉందని వాదించారు. ఎక్కడైతే సీఎం ఉండి పనిచేస్తారో అదే క్యాంప్ కార్యాలయమని ఏజీ తెలిపారు. క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుపై, పూర్తిస్థాయి వివారాలు ఇవ్వాలని, ఇప్పటి సియంకు కానీ, గత సియంలకు కానీ, ఎన్ని క్యాంప్ ఆఫీస్లు ఉన్నాయో చెప్పాలని హైకోర్టు ఆదేశించటంతో,  ఆ వివరాలు శుక్రవారం అందజేస్తామని ఏజీ తెలిపారు. ఏజీ అభ్యర్థన మేరకు విశాఖ గెస్ట్‌హౌస్‌పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. 
 
విశాఖ, కర్నూల్ లో, రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టి ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు అని వేసిన పిటీషన్ పై, విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అమరావతిలో ఎలాంటి మౌలిక సదుపాయాలు చేయకుండా, రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టి విశాఖలో ఎలాంటి మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయకూడదు అని వేసిన పిటీషన్ పై స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం వెల్లడించింది. 
 
మండలి రద్దు పై వేసిన పిటీషన్ ను, ఈ కేసుల జాబితాలో నుంచి తొలగించి, వేరే బెంచ్ కు బదిలీ చేసారు. మరొక పిటీషన్లో, అమరావతి మాస్టర్ ప్లాన్ లో, 9 థీం సిటీస్ ఉన్నాయని, మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేయకూడదు అని వేసిన పిటీషన్ పై, స్టేటస్‌ కో ఉత్తర్వులను ధర్మాసనం ఇచ్చింది. 
 
అమరావతి మెట్రోపోలిటన్ అథారిటీ పై స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం వెల్లడించింది. ఇది వరకు కోర్టు ఆదేశాలు ఇచ్చే లోపే, ఇది ప్రారంభం అయ్యిందని, ఇక నుంచి అమరావతి మెట్రోపోలిటన్ అథారిటీ పేరుతో ఏమి చేయకూడదని, స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు  
 
ఇక అకౌంటెంట్ జెనెరల్ ను, ప్రతివాదిగా చేర్చాలని, ఆయన నుంచి తమకు వివరాలు కావాలి అంటూ, అమరావతి నిర్మాణానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేసారు, ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఎన్ని ఫేసేజ్ లో ఈ ఖర్చు ఉంటుంది, కాంట్రాక్టర్లకు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత బాకీ ఉంది, లాంటి పూర్తి అంశాల పై, తమకు వివరాలు సమర్పించాలని, దీనికి ప్రతివాదిగా "అకౌంటెంట్‌ జనరల్‌" ను చేర్చాలని వేసిన పిటీషన్ పై స్పందించిన ధర్మాసనం అకౌంటెంట్ జెనెరల్ ను, ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. ఈ వివరాలు అన్నీ అకౌంటెంట్ జెనెరల్, త్వరలో కోర్టుకు సమర్పించనున్నారు. 
 
ఇక మరో పిటీషన లో, అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థాలాలు ఇచ్చే విషయంలో పిటీషన్ దాఖలు కాగా, దీని పై పిటీషనర్ తరుపు న్యాయవాది వాదిస్తూ, ఇప్పటికే ఉన్న మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసి, ఇళ్ళ స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే దీని పై స్టే ఇచ్చామని, ఆ స్టే కొనసాగుతుందని, హైకోర్టు తెలిపింది. అలాగే ఈ పిటీషన్ ను, డివిజన్ బెంచ్ కు బదిలీ చేస్తున్నట్టు చెప్పింది. 
 
మరొక పిటీషన్లో, అమరావతి పరిధిలో ఎలాంటి భూముల క్రయ విక్రయాలు, ప్రభుత్వం జరపకూడదని వేసిన పిటీషన్ పై, అడ్వొకేట్ జనెరల్ అభ్యంతరం చెప్పారు. తమ ప్రభుత్వానికి అమరావతి పరిధిలో భూముల క్రయ విక్రయాలు చేసుకునే హక్కు ఉందని చెప్పగా, పిటీషనర్ తరుపు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. ధర్మాసనం స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిన వేళ ఇలా చేయటం కుదరదని చెప్పటంతో, దీని పై కూడా స్టేటస్ కో ఆదేశాలు వచ్చాయి 
 
ఇక రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై వేసిన పిటీషన్ పై, ఈ రెండు బిల్లులు చట్ట సభల్లో ప్రవేశపెట్టె ముందు, ఏపి బిజినెస్ రూల్స్ తో పాటుగా, ఐఎస్ఎస్ కండక్ట్ రూల్స్ ని పాటించి, ఈ బిల్లులు తయారు చేసారా అనే పిటీషన్ పై స్పందించిన ధర్మాసనం, ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి వివరాలు సీల్డు కవర్‌లో న్యాయస్థానానికి అందజేయాలని స్పష్టం చేసింది. 
 
ఇక అలాగే రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు, మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించిన తరువాత, సెక్రటరీ నోటిఫై చెయ్యలేదని పిటీషన్ దాఖలు కాగా, రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు, ఆడియో, వీడియో వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.