బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:33 IST)

తెలంగాణాలోని వలస కూలీలకు బిగ్ రిలీఫ్...

లాక్‌డౌన్ కారణంగా తెలంగాణా రాష్ట్రంలో చిక్కుకున్న మహారాష్ట్ర వలస కూలీలు, విద్యార్థులకు అతిపెద్ద ఊరట లభించింది. ఈ కూలీలు తమతమ స్వస్థాలకు చేరుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. దీంతో ఈ కూలీలంతా తమతమ సొంతూర్లకు వెళ్లనున్నారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇది వచ్చే నెల 3వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలు లేకపోలేదు. అయితే, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా అంతర్‌రాష్ట్ర సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకునిపోయిన వలస కూలీలు వచ్చేందుకు మహారాష్ట్ర సర్కారు సమ్మతించింది.