మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (10:50 IST)

తీన్మార్ మల్లన్న అరెస్ట్ వెనుక పక్కా స్కెచ్, సింగిల్ బ్యారెక్‌లో...

తెలంగాణాలో టిఆర్ఎస్ పెద్దల అవినీతిని ఎండగడుతున్న తీన్మార్ మల్లన్న అరెస్ట్ అంతా రహస్యంగా, పక్కగా ఓ ప్రణాళిక ప్రకారం జ‌రిగింద‌ని తెలుస్తోంది. సాధారణ విచారణ పేరుతో నమ్మకంగా పిలిచి చర్లపల్లికి గోప్యంగా తరలించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు ముందే తెలిసి చర్లపల్లి జైలులో సింగిల్ బ్యారెక్ కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. 
 
ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)ను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అత్యంత రహస్యంగా అరెస్టు చేశారు. ఇటీవల డబ్బుల కోసం తీన్మార్‌ మల్లన్న తనను బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణ అనంతరం తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేశారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపేనని, దీన్ని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. తీన్మార్ మల్లన్నను చట్టబద్ధంగా హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని సీనియర్ పాత్రికేయులు అభిప్రాయ పడుతున్నారు.
 
సీతాఫల్​ మండిలోని మధురానగర్​లో మారుతీ జ్యోతిష్యాలయం అనే సంస్థను లక్ష్మీకాంత్ శర్మ నిర్వహిస్తున్నారు. ఈ జ్యోతిష్యాలయంపై ఇటీవల క్యూ న్యూస్‌లో ​వరుస కథనాలు ప్రసారం చేశారని, ఆ తర్వాత డబ్బుల కోసం బెదిరింపులకు దిగాడని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు. ఇదంతా పాలకుల అభూతక‌ల్ప‌నే అని జ‌ర్న‌లిస్టు సంఘాలు పేర్కొంటున్నాయి.