సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (11:36 IST)

బీజేపీ-జనసేన మధ్య బీటలా..? పవన్‌ను సోము వీర్రాజు కలిశారే..

Pawan_Somu veeraju
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ, జనసేన పార్టీల మధ్య వైరం వుందని.. ఆ పార్టీల మధ్య విబేధాలున్నట్లు వార్తలొచ్చాయి. జనసేన పార్టీతో బీజేపీ దోస్తీ లేనట్టేనని ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే దిశగా తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మరింత అవగాహన కోసం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాదులో సోమవారం ఉదయం సమావేశం జరిగింది. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతి ఎంపీ అభ్యర్థి, తాజా రాజకీయ పరిస్థితులు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయని ఆ ప్రకటనలో తెలిపారు.
 
2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో బీజేపీ-జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికలతో నాంది పలకాలని పవన్, సోము వీర్రాజు నిర్ణయించారు. 
 
ఏదైనా అంశంలో అభిప్రాయభేదాలు ఉంటే ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని తీర్మానించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ, జనసేనల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉమ్మడి అభ్యర్థిగానే భావించి విజయానికి కృషి చేయాలని అవగాహనకు వచ్చారు.