శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 5 ఏప్రియల్ 2017 (19:18 IST)

చంద్రబాబుకు గట్టి షాక్... నేనే ముఖ్యమంత్రినైతే వారితో రాజీనామా చేయిస్తా... విష్ణు

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గట్టిగానే షాకులు తగులుతున్నాయి. తాజాగా ఏపీ బీజెఎల్పీ నాయకుడు విష్ణుకుమార్ రాజు చంద్రబాబు నాయుడు మీద విమర్శనాస్త్రాలు సంధించారు. తనే కనుక ముఖ్యమంత్రిగా వున్న

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గట్టిగానే షాకులు తగులుతున్నాయి. తాజాగా ఏపీ బీజెఎల్పీ నాయకుడు విష్ణుకుమార్ రాజు చంద్రబాబు నాయుడు మీద విమర్శనాస్త్రాలు సంధించారు. తనే కనుక ముఖ్యమంత్రిగా వున్నట్లయితే వైసీపి నుంచి వచ్చి ఇపుడు మంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారితో వెంటనే రాజీనామాలు చేయించి, పార్టీ తరపును పోటీ చేయించిన తర్వాత వారికి పదవులు కట్టబెట్టేవాడినంటూ చెప్పుకొచ్చారు.
 
పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలతో తాను వ్యక్తిగతంగా ఏకీభవిస్తానంటూ చెప్పుకొచ్చారు. పార్టీ ఫిరాయింపులను ఏ పార్టీ కూడా మద్దతు తెలుపడం మంచిది కాదని చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లేవారు రాజీనామాలు చేసి వెళ్లాలని సూచించారు.