గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 22 ఏప్రియల్ 2017 (07:35 IST)

వైఎస్ జగన్‌కి దొడ్డిదారిన అధికారం కట్టబెట్టడానికి బీజేపీ ప్లాన్‌: బిత్తరపోతున్న బాబు

గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ వైఎస్ జగన్‌కి దొడ్డిదారిన అధికారం కట్టబెట్టడానికి లోపాయికారీగా పథక రచన చేస్తోందా? వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి బీజేపీకి పెద్ద ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇటీవలి ఎన్నికల్లో

గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ వైఎస్ జగన్‌కి దొడ్డిదారిన అధికారం కట్టబెట్టడానికి లోపాయికారీగా పథక రచన చేస్తోందా? వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి బీజేపీకి పెద్ద ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణకు భారీఎత్తున ప్రయత్నాలు చేపట్టనుందని సమాచారం. భారీ ప్రయత్నాలు అంటే నిర్మాణ పరంగా బలం పెంచుకోవడం అని కాదు. ఈసారి ఏపీలో పోటీ చేసే సీట్లను గణనీయంగా దక్కించుకోవడంపైనే బీజేపీ ప్రధానంగా దృష్టి పెడుతోందట.
 
 
గత ఎన్నికల్లో ఏపీలో 15 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం కనీసం 80 స్థానాలకు బీజేపీ గాలం వేసిందని తెలుస్తోంది. ఏపీలో శాసనసభా స్థానాలను పెంచడం సాద్యపడినట్లయితే బీజేపీకి అన్ని స్థానాలు డిమాండ్ చేసే అవకాశం మెండుగా ఉన్నట్లు భావిస్తున్నారు.
 
బీజేపీ తన దేశవ్యాప్త బలాన్ని, విస్తరణను సాకుగా చూపి ఏపీలో 80 స్థానాలను డిమాండ్ చేయండంలో తప్పు లేదు కానీ బీజేపీ ఈ వ్యూహంతో ఉందని తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు షాక్ తిన్నారట. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలో 80 స్థానాలను తీసుకుని పోటీ చేస్తే కనీసం 70 ఎమ్మెల్యే సీట్లను కనీసంగాకూడా పోటీ చేయకుండానే వైఎస్సార్ సీపీ చేతుల్లో పెట్టినట్లే అని చంద్రబాబు భయం. 
 
ఎందుకంటే ఏపీలో బీజేపీ సత్తా ఏమిటో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు. 2019లో ఏపీలో టీడీపీ, వైకాపా, జనసేన మధ్య ప్రతి సీటుకూ సంకుల సమరం జరగనుందని అందరీకీ తెలుసు. బీజేపీ అసందర్భమైన డిమాండ్లను అంగీకరించడం చంద్రబాబుకు కష్టసాధ్యమే. ఇప్పుడున్న సంబంధాల్లో ఏమాత్రం తేడా వచ్చినా రెండో అవకాశంగా బీజేపీ వైకాపాతో పొత్తుకు లేదా మద్దతుకు కూడా సిద్దపడే అవకాశాన్ని కొట్టిపడేయలేం. అందుకే బీజేపీ ఎత్తు వెనుక వ్యూహం ఏమిటన్నది చంద్రబాబు క్లియర్ చేసుకుంటున్నారు.