గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:05 IST)

ఏపీలో మళ్లీ పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

ఏపీ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  24 గంటల వ్యవధిలో 11 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. 
 
8 రోజుల్లో 200కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,889 మ్యూకర్ మైకోసిస్ కేసులు నమోదయ్యాయి. 
 
ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 463 మందికి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 3 కేసులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
ప్రకాశం జిల్లాలో రెండు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. 
 
వారం రోజుల వ్యవధిలో బ్లాక్ ఫంగస్ కారణంగా 12 మంది మృతి చెందారని దీంతో మ్యూకర్ మైకోసిస్ కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 448 మంది మరణించినట్టు తెలియజేసింది.