చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ బెదిరింపు
హైదరబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక స్థలం చార్మినార్ వద్ద బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాన్‌లో స్థానిక పోలీసులను ఆందోళనకు గురిచేసింది. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ చార్మినార్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనీఖీల్లో ఉత్తుత్తి ఫోన్ కాల్ అని తేలడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ బాంబు బెదిరింపుతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బృందం పోలీసులు చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు, హోటళ్ళలో తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎక్కడా బాంబు లేకపోవడంతో అది ఫేక్ అని నిర్ధారించారు.
దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పైగా, అది అకతాయిల ఫేక్ కాల్‌గా భావిస్తున్నారు. అయితే, చార్మినార్‌కు బాంబు బెదిరింపులు ఇవే కొత్తకాదు. గతంలోనూ పలుమార్లు ఈ తరహా ఫోన్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.