గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (11:38 IST)

వణికిపోతున్న తెలంగాణ - పడిపోయిన ఉష్ణోగ్రతలు

cold temperature
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణాలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణికిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణం కంటే నాలుగు డిగ్రీల నుంచి ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. 
 
ఆదివారం తెల్లవారుజామున కుమరం భీం జిల్లా సిర్పూరులో అత్యల్పంగా 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
ఈ సీజనులో ఇంత తక్కువ మోతాదులో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో మున్ముందు మరింత తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది.