మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (11:42 IST)

పెళ్లికూతురైన ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ- మెహందీ ఫంక్షన్

ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురైంది. బంధువులతో భూమా అఖిలప్రియ ఇల్లు కళకళలాడుతోంది. సోమవారం మంత్రి భూమా అఖిల ప్రియ, పెళ్లికుమారుడు భార్గవ్‌రామ్‌ల మెహందీ వేడుకలు జరిగాయి. ఇద్దరికీ బంధు

ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురైంది. బంధువులతో భూమా అఖిలప్రియ ఇల్లు కళకళలాడుతోంది. సోమవారం మంత్రి భూమా అఖిల ప్రియ, పెళ్లికుమారుడు భార్గవ్‌రామ్‌ల మెహందీ వేడుకలు జరిగాయి. ఇద్దరికీ బంధు మిత్రులు పేరంటం చేశారు. వచ్చిన వారికి రకరకాల విందు వంటలను వడ్డిస్తున్నారు. 
 
మామ ఎస్వీ మోహన్‌రెడ్డి, అన్నయ్య భూమా బ్రహ్మానందరెడ్డి పెళ్లి వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. వచ్చిన అతిథులను దగ్గరుండి ఆహ్వానిస్తున్నారు. ఆళ్లగడ్డలో ఈ నెల 29న జరగనున్న వివాహ వేడుకకు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, పలువురు ప్రముఖులు రానుండడంతో అధికారులు సోమవారం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
 
అఖిలప్రియ వివాహం ఈ నెల 29న ఉదయం 10:57 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పెళ్లికి రెండు రోజులు ముందుగానే.. ఆమెకు మంగళ స్నానాలు చేయించి నవ వధువుగా అలంకరించారు. ఆమె పెళ్లికూతురుగా ముస్తాబైన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇప్పటికే.. వివాహ శుభ ప్రతికను ప్రముఖులందరికీ అందజేశారు. ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల ఫోటోలు ముద్రించారు. ఈ వివాహానికి భూమా అభిమానులు కూడ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేస్తున్నారు. పటిష్ట భద్రతను కూడా ఏర్పాటు చేశారు.