బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 3 అక్టోబరు 2018 (22:02 IST)

ఓటుకు నోటు కేసులో మమ్మల్ని ఏమీ చేయలేరు... ఎవరు?

ఓటుకు నోటు కేసులో తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని ఇంటరాగేషన్లు, ఇన్విష్టిగేషన్లు చేసుకున్నా తమకేమీ ఫర్వాలేదన్నారు.

ఓటుకు నోటు కేసులో తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని ఇంటరాగేషన్లు, ఇన్విష్టిగేషన్లు చేసుకున్నా తమకేమీ ఫర్వాలేదన్నారు. తాము చాలా క్లియర్‌గా ఉన్నామన్నారు. హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నాయకుడిని, జగ్గారెడ్డిని కేసుల పేరుతో వేధిస్తున్నారన్నారు. 
 
ఎన్నికల వచ్చినప్పుడు మాత్రమే విపక్ష నాయకులపై కేంద్ర ప్రభుత్వం ఐటీ, సీబీఐ, పోలీసులతో దాడులకు పాల్పడుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తమిళనాడు, కర్నాటకల మాదిరిగానే తెలంగాణాలోనూ ఇటువంటి దాడులే జరుగుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అధికార వ్యవస్థలను తన చేతులోకి తీసుకుని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. 
 
ఏపీపైనా ప్రధాని మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. విభజన సమస్యలు అమలు చేయడంలో ఆయన విఫమయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలకు వివరిస్తామన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక నాయకులను చూసి జగన్, పవన్ కల్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు. అంతర్గతంగా రాజకీయ విమర్శలు చేసుకున్నా ఫర్వాలేదని, బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రం రాష్ట్రాభివృద్ధికి అంతా కలిసికట్టుగా ఉండాలని హితవు పలికారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.