సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , శనివారం, 18 ఫిబ్రవరి 2017 (03:53 IST)

బంధువులు, కులాలు చూసి ఓట్లెయ్యరు.. జనం నమ్మకపోతే పోతాం: చంద్రబాబు వార్నింగ్

బంధువులు, కులాలను చూసి ఓట్లేయరని, ప్రజల విశ్వాసం చూరగొనకపోతే ఓట్లు రావని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బడ్జెట్‌ సమావేశాలపై చర్చించేందుకు శుక్రవారం విజయవాడలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రులు, టీడీపీ ఎమ్

బంధువులు, కులాలను చూసి ఓట్లేయరని,  ప్రజల విశ్వాసం చూరగొనకపోతే ఓట్లు రావని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బడ్జెట్‌ సమావేశాలపై చర్చించేందుకు శుక్రవారం విజయవాడలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించిన బాబు నేతలు, కార్యకర్తలకు పెద్దస్థాయిలోనే క్లాసు తీసుకున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో కులమూ, బంధువర్గమూ ప్రభావం చూపబోవని హితవు చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ కులం, కేంద్రంలో ప్రధాని కులం చూసి ఓట్లేశారా అని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించి నాలుగైదు జిల్లాల్లో క్రమశిక్షణారాహిత్యం మొదలైందని ఇది ఇలాగే కొనసాగితే జనం విశ్వాసం కోల్పోవడం ఖాయమని చంద్రబాబు హెచ్చరించారు.  మంత్రులు ఇతర నియోజకవర్గాల్లో, ఇతర జిల్లాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. విభేదాలున్నా అందరూ కలసి పనిచేయాలని కోరారు. 
 
తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మీడియాలో వచ్చే సెన్సేషనల్‌ న్యూస్‌కు అడ్డుకట్ట వేయకపోతే నష్టం పెరుగుతుందని చెప్పారు. స్పీకర్‌ కోడెల మాటలను వక్రీకరించారని, జాతీయ మీడియా ఏదో రాద్ధాంతం జరిగినట్లు చూపించిందన్నారు. పదవులు ఎవరికివ్వాలనేది తన నిర్ణయమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.