శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (11:47 IST)

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకం : సీబీఐ

cbi logo
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో భాస్కర్ రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. పులివెందులలోని నివాసంలో కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి తరలించారు ఆదివారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించారు. 
 
కాగా, భాస్కర్ రెడ్డి అరెస్టు మెమోను ఆయన భార్య లక్ష్మీ, వ్యక్తిగత సహాయకుడికి సీబీఐ అధికారులు అందజేశారు. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 120బి, రెడ్ విత్ 201, 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలంగా ఉందని సీబీఐ అధికారులు వెల్లడించారు. 
 
వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడారని తెలిపారు. ఇందుకు వైఎస్.లక్ష్మీ, పి.జనార్థన్‌లను సాక్షులను పేర్కొన్నారు. 120బి కుట్ర, 302 మర్డర్, 201 అధారాలు చెరిపివేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.