ఎందుకు రాజీనామా చేశానో తర్వాత చెపుతా? ఆయన సంప్రదించలేదు : లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన భవిష్యత్‌పై స్పందించారు. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తర్వాత చెబుతానని వెల్లడించారు. ముఖ్యంగా, తాను భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాననే విషయాన్ని వివరిస్తానని తెలిప
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన భవిష్యత్‌పై స్పందించారు. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తర్వాత చెబుతానని వెల్లడించారు. ముఖ్యంగా, తాను భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాననే విషయాన్ని వివరిస్తానని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను సంప్రదించలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన లక్ష్మీనారాయణ తన ఐపీఎస్ కొలువుకు ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈయన రాజీనామాను మహారాష్ట్ర సర్కారు ఇంకా ఆమోదించలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ, తన రాజీనామా ఆమోదం పొందడంలో ఆలస్యం జరుగుతోందని కానీ, ఉద్దేశపూర్వకంగా కాదని, వరుస సెలవుల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన రాజీనామాపై దృష్టి సారించలేక పోతున్నారని వివరణ ఇచ్చారు.
ఇకపోతే, పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి తనను స్వాగతిస్తానని చెప్పినట్లు తాను పేపర్లో చదివానని, అలాగే పవన్ జేఎఫ్‌సీ గురించి కూడా చదివానని జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా కొన్ని ఉన్నాయని, రాజీనామా ఆమోదం పొందాక ఎందుకు చేశానన్న విషయం చెబుతానని అన్నారు.