కృష్ణ మోహన్‌కు మరోసారి సీబీఐ నోటీస్
విశాఖలోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్‌కు మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. కోర్టులు, జడ్జీలపై వ్యాఖ్యల కేసులో గతంలో కృష్ణ మోహన్‌కు సీబీఐ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసందే.
ఈ నెల ఆరో తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. కానీ 6న హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐని ఆమంచి కోరాడు. దీనితో రేపు విశాఖలోని సీబీఐ కార్యాలయానికి రావాలని మరోసారి కృష్ణ మోహన్‌కు సీబీఐ నోటీస్ ఇచ్చింది.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన సమయంలో ఏపీ హైకోర్టును, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగాలు ఆమంచిపై ఉన్నాయి. న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు పలువురిపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి.
సోషల్ మీడియా వేదికగా దూషణలు చేసిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు రాజకీయాలను అపాదించడం, వారిని భయభ్రాంతులకు గురి చేసేలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం సీబీఐ నోటీసులకు కారణమైంది.