1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (20:35 IST)

జగన్ పైన చంద్రబాబు పైర్

పెట్రోల్‌, డీజిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుడిమాండ్ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రంలో ఎక్కువ ధరలు ఉన్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేవరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు.
 
రాష్ట్రంలో అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద మంగళ వారం (నవంబర్ 9వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ శ్రేణులు ధర్నాలు చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. తమ ధర్నాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. 
 
ఆ తర్వాత మరిన్ని కార్యక్రమాలు చేపడతాం.. పెట్రోల్, డీజిల్ తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు.
 
అన్ని రాష్ట్రాలకంటే తక్కువకే ఇస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్‌రెడ్డి..ఇప్పుడు మాత్రం ధరలు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. అని రాష్ట్రాల్లో తక్కువంటే.. పెట్రోల్ రూ. 94, డీజిల్ రూ. 80 గా ఉందని చంద్రబాబు తెలిపారు.
 
ఏపీలో మాత్రం ప్రతి వస్తువుపై ధరలు పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై 16 రూపాయాలు తగ్గించాలని కోరారు. నిత్యావసరాలు, నాసిరకం మద్యం, ఇసుక, ఆర్టీసీ చార్జీలు, కరెంట్ బిల్లులు ఇలా ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు.