శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 4 నవంబరు 2017 (21:14 IST)

ఎపి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమే.. చంద్రబాబు(వీడియో)

తిరుపతి అభివృద్థి అంతా తెలుగుదేశంపార్టీ ఘనతేనన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవారి కళ్లలో ఆనందాన్ని చూడడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారాయన. తిరుపతిలోని తనపల్లిలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 1750 పక్కా గృహాలను ప్ర

తిరుపతి అభివృద్థి అంతా తెలుగుదేశంపార్టీ ఘనతేనన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవారి కళ్లలో ఆనందాన్ని చూడడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారాయన. తిరుపతిలోని తనపల్లిలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 1750 పక్కా గృహాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నిరుపేదలకు అందజేశారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్లను నాటారు. 
 
ఈ సంధర్భంగా జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ  తిరుపతిని సిటీ ఆఫ్‌ లేక్స్‌గా వంద చెరువులను సుందరీకరణ చేస్తున్నట్లు సిఎం చెప్పారు. పేదవారికి సొంత ఇంటి కలను నెరవేరస్తున్నామని, ఇబ్బందులు, సమస్యలు ఎన్ని ఉన్నా పేదవారి సంక్షేమాన్ని విస్మరించమని చెప్పారు. 
 
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 14లక్షల ఇళ్ళకు, పట్టణ ప్రాంతాల్లో 5.39 లక్షల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇందుకోసం 50వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు సిఎం. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలు పెడుతున్నామని, నైపుణ్యాల శిక్షణను వారికి కూడా వారికి ఇప్పిస్తున్నట్లు చెప్పారు. వీడియో...