గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (18:26 IST)

వైకాపాకు షాక్... వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం.. చంద్రబాబు

Chandra babu Naidu
Chandra babu Naidu
వైకాపాకు ఇది షాకిచ్చే వార్తే. తెదేపా వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీంతో టీడీపీకి వైకాపా నియమించిన వాలంటీర్ల నుంచి కూడా మద్దతు లభించే అవకాశం వున్నట్లు రాజకీయ పండితులు చెప్తున్నారు. కాగా ప్రజలకు సేవ చేయాలని వాలంటీర్లను కోరుతున్నానని చంద్రబాబు అన్నారు. కొవ్వూరులో ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
 
పనిలో పనిగా జగన్ సర్కారుపై మండిపడ్డారు చంద్రబాబు. వైకాపా డీఎన్ఏలోనే శవరాజకీయం వుందని.. రక్తంలో మునిగిన వైకాపా నేతలకు ఓట్లు వేయవద్దని జగన్ సోదరే కోరుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని జగన్ సర్కారు అంధకారంలోకి నెట్టేసిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే మిత్రపక్షంతో వచ్చి కూటమిగా జట్టు కట్టామన్నారు.