1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (11:54 IST)

శుక్రవారం టీడీపీలో చేరనున్న రఘురామరాజు... ఆ రెండు స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ!!

raghurama krishnamraju
వైకాపా రెబెల్ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీ మారనున్నారు. ప్రస్తుతం వైకాపా ఎంపీగా ఉన్న ఆయనకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. తమ పార్టీ నేత శ్రీనివాస్ వర్మకు టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఆయన సందిగ్ధంలో పడిపోయారు. పైగా, బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏపీలో సీఎం జగన్‌ పాలనపై తిరుగుబాటు చేసిన తొలి నేతగా ఆర్ఆర్ఆర్ నిలిచారు. పైగా, రాజధాని అమరావతి రైతులకు ఆయన అండగా నిలించారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ లేదా జనసేన పార్టీల్లో చేరుతారనే ప్రచారం సాగుతుంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ శుక్రవారం టీడీపీలో చేరనున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకుంటారు. ఈ మేరకు మంగళవారం రాత్రి చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. 
 
ఈ భేటీలో రఘురాజుకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పినట్టు సమాచారం. ఉండి నియోజకవర్గం నుంచి రఘురాజును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగే సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో రఘురాజు చేరనున్నట్టు సమచారం. ఈరోజు రఘురాజు భీమవరం వెళ్తున్నారు. ఈ సందర్భంగా భీమవరం, ఉండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.