బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (09:40 IST)

హైదరాబాద్‌లో 1చంద్రబాబుకు మద్దతుగా 'లెట్స్ మెట్రో రైడ్ ఫర్ సీబీఎన్'

lets metro for cbn
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు తోచిన రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులు మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారు చుట్టారు. 
 
శనివారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నల్లరంగు టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం చేస్తూ నిరసన తెలిపేలా పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమం మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ స్టేషన్ల మధ్య జరుగుతుంది. ఇతర మెట్రో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా వారు నిరసన తెలిపేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
మియాపూర్ - ఎల్బీ నగర్ మధ్య వీలైనన్ని స్టేషన్లలలో నల్ల రంగు టీషర్టులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందులో టీడీపీ మద్దతుదారులు కూడా పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో మెట్రో ఏర్పాటుకు కావడానికి కారణమైన టీడీపీ అధినేతకు మద్దతు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.