అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ- బరిలోకి 20 జట్లు
అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగబోతుంది. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ-20 ప్రపంచ కప్ 2024 టోర్నీ జరుగనుంది. తాజాగా టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ని ఐసీసీ విడుదల చేసింది. వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏ, సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.
2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మొట్టమొదటిసారి 20 దేశాలు పాల్గొనబోతున్నాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 20 దేశాలు పాల్గొనడం ఇదే మొదటిసారి. జూన్ 4 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ టోర్నీ, జూన్ 30న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. జూన్ 4 నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆరంభం కాబోతుండడంతో ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ ముందుకు జరిగే అవకాశం ఉంది.
జూన్ మొదటి వారంలో లేదా మే చివర్లో ఐపీఎల్ మ్యాచులు ముగుస్తాయి. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ కోసం కనీసం 10-15 రోజులు ముందుగానే ఐపీఎల్ 2024 సీజన్ ముగియనుంది.