శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:59 IST)

తిరుమలలో చిరుతపులి కలకలం

తిరుమలలో బుధవారం రాత్రి చిరుతపులి కలకలం రేగింది. రాత్రి ఎనిమిది గంటలకు స్థానికులు నివాసముండే ఈస్ట్‌ బాలాజీనగర్‌ 1060 నెంబరు గల ఇంటి సమీపానికి వచ్చిన చిరుతపులిని స్థానికులు గుర్తించారు.

వెంటనే భయంతో కేకలు వేస్తూ ఇళ్లలోకి పరుగులు తీశారు. స్థానికుల అరుపులతో పులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది.

సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు సంఘటనా చేరుకుని స్థానికులను అప్రమత్తం చేశారు. రాత్రి వేళలో ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో పులులు పలుమార్లు కనిపించడం గమనార్హం.