చిట్టమూరు ఎస్సీ హాస్టల్‌లో అనుమానస్పందగా విద్యార్థి మృతి..

suicide
ఎం| Last Updated: ఆదివారం, 7 జులై 2019 (11:40 IST)
నెల్లూరు జిల్లా- చిట్టమూరు మండలం, మీజూరు గ్రామానికి చెందిన 9 తరగతి చదివే చరణ్ (13) అనే విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం 3.30 నిలకు అనుమానస్పదస్ధితిలో మృతి చెందాడు. చిట్టమూరులోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ ఎస్సీ - 1 బాలుర వసతి గృహంలో ఉంటూ... చిట్టమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యను అభ్యసిస్తున్న చరణ్. 
 
పాఠశాల ఆవరణలో సహచర విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం సమయంలో ఆటలాడుకుంటుండగా కింద పడి మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే విద్యార్థి చరణ్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఫిట్స్‌తో భాదపడుతున్నడనే కారణాలు స్ధానిక వార్డను, సహాయ సంక్షేమ అధికారులు తెలుపుతూ స్ధానిక పత్రికలు, మీడియాను తప్పుదారి పట్టించిన్నారు. 
 
విషయం తెలుసుకున్న యస్.ఎన్.పి.యస్.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పాల రఘు విద్యార్థి చరణ్ మృతి పట్ల చిట్టమూరు ఎస్సీ హస్టలు వార్డన్ దుంపల మహేంద్రతో ఫోన్ లో మాట్లాడగా వార్డన్ తప్పుడు సమాచారం తెలుపుతున్నాడని అర్థం అవుతుంది. మీజూరు చరణ్ మృతి కారణాలు వెళ్ళడించలేదని అనుమానం కలుగుతోంది. చరణ్ మృతికి కారకులు వార్డన్ మహేంద్ర, సహయ సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యమేనాని తెలుస్తోంది. 
 
విద్యార్థి చరణ్ మృతి అనారోగ్య కారణమైన లేదా ప్రమాదాల కారణమైన విద్యాహక్కు చట్టం ప్రకారం మరియు ప్రభుత్వ రూల్స్ ప్రకారం స్ధానిక హస్టలలో ఉండి చదువుతున్న విద్యార్థుల సంరక్షణ బాధ్యత అధికారులుదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతి విద్యార్థి పట్ల స్ధానిక సిబ్బంది అధికారులు అక్కడే ఉండి పిల్లలు బాగోగులు చూసుకోవాలని చూసిస్తున్న ...కానీ చిట్టమూరు ఎస్సీ హస్టలలో ఇందుకు భిన్నంగా ఉంది.
 
 
వాస్తవానికి మీజూరు చరణ్ మృతి అనారోగ్య కారణాలు అయిన లేకపోతే ఏదైనా ప్రమాదం అయిన ముందుగా సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం తెలపాలి. అనంతరం మృతి చెందిన వ్యక్తి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యులకు తరలించాలి. అంతేకాదు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులకు మరియు స్ధానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు సంఘటన గురించి తెలియజేయాలి. 
 
అయితే ప్రభుత్వం రూల్స్ ప్రకారం హస్టలు వార్డను దుంపల మహేంద్ర, సహయ సంక్షేమ అధికారి లక్ష్మీ రాజ్యం కలిసి ఎలాంటి సమాచారం లేకుండా పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు.? చరణ్ మృతి చెందిన వెంటనే స్ధానిక సమీపంలో ఉన్న ప్రభుత్వ వైద్యులకు ఎందుకు తీసుకుని వెళ్ళలేదు?  ప్రైవేటు వైద్యులకు తీసుకుపోయి అక్కడ చనిపోయిన వెంటనే రాత్రికి రాత్రి మీజూరు గ్రామంలో ఉన్న పిల్లవాడి తల్లిదండ్రులకు చరణ్ మృతదేహాన్ని అప్పగించారు. చరణ్ మృతి పట్ల వాస్తవాలు పత్రికవారికి ఎందుకానీ తప్పుడు సమాచారం ఇచ్చారు. 
 
చరణ్ మృతి పట్ల ఇంత రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు. స్ధానిక మండల పోలీసులు చరణ్ మృతి దేహం పట్ల పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి ఎందుకు తరలించలేదు.? సాంఘీక సంక్షేమ అధికారులతో కలిసి స్ధానిక పోలీసులు కుమ్మక్కు అయ్యారని చరణ్ మృతి పట్ల అర్థం అవుతుంది. గతంలో మేనకూరు ఎస్సీ హస్టలలో కూడా ఒక విద్యార్థి రైళ్లు పట్టాలపై ప్రమాధపుశతం మృతి చెందిన ఆ విద్యార్థి పట్ల హస్టలు వార్డను పరిరక్షణ లోపంతో వ్యవహరించిన విషయమై అప్పటి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు హస్టలు వార్డను సస్పెండ్ చేశారు. 
 
అంతేకాదు ఆ విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ హస్టలు ఇన్స్ రెషన్స్ ప్రకారం ఆర్థిక సహాయం అందించారు. అలాగే వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం, ఒక ఎకరా ప్రభుత్వ భూమి కూడా కల్పించారు. ఇప్పుడు చిట్టమూరు ఎస్సీ బాలుర హస్టలలో మృతి చెందిన చరణ్ ది తప్ప.? లేక హస్టలు వార్డను పరిరక్షణ లోపమా.? విషయం అంతా తెలిసికూడా సహయ సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం పోస్ట్ మార్టం అనుమతికి ఎందుకు అంగీకరించబడలేదు.? అమాయకులు అయిన మీజూరు ఎస్సీ కుటుంబ సభ్యులను ఎందుకు తప్పుదారి పట్టిస్తుందన్న అనుమానాలు వ్యక్తంఆవుతుంది.
విద్యార్థి చరణ్ మరణం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని కొప్పాల రఘు ఆరోపణలు చేస్తున్నారు. 
 
ప్రభుత్వ హస్టలకు ఉన్న ఇన్స్‌రెషన్స్ విద్యార్థి చరణ్‌కు వర్తించదా...? జిల్లా కలెక్టర్ ఎంవి. శేషగిరిబాబు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి నష్టా పరిహారం కింద 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారి, కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అలాగే మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని కూడా కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని పదమూడు ఏళ్ల చిన్న వయసులోనే తల్లిదండ్రులకు, కుటుంబానికి శోకాన్ని మిగిల్చిన విద్యార్థి చరణ్ మృతి పట్ల తప్పుడు సమాచారం తెలుపుతున్న సహయ సంక్షేమ అధికారి ఎ.యస్.డబ్ల్యూ.వో లక్ష్మీరాజ్యం, హస్టలు వార్డను దుంపల మహేంద్రపై చర్యలు చేపట్టాలని చరణ్ మృతిదేహనికి ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు అన్న విషయంపై పూర్తి స్థాయిలో విచారించి తగిన కరకూలను సస్పెండ్ చేయాలని యస్.ఎన్.పి.యస్.నేతలు రాష్ట్ర కోశాధికారి బి.మధుసుధన్ రావు, సమితి జిల్లా అధ్యక్షుడు యస్.కే.ఛాన్ బాషా, సమితి జిల్లా యస్.ఫ్.స్టూడెంట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వి.విక్రమ్, సమితి జిల్లా కార్మిక శాఖ అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, సమితి జిల్లా మహిళ అధ్యక్షురాలు నూలు మేరీ, సమితి జిల్లా మహిళ మైనారిటీ అధ్యక్షురాలు యస్.కే.షాహీర మరియు విద్యార్థి మీజూరు చరణ్ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారుదీనిపై మరింత చదవండి :