1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (08:25 IST)

ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేసిన జిల్లా కలెక్టర్.. ఎందుకు?

చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఐదు మండలాల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇలా వేతనాలు నిలుపుదల చేసిన మండలాల్లో పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లెలు ఉన్నాయి.
 
ఈ మండలాల్లోని రెవెన్యూ, పంచాయతీరాజ్, హెల్త్, సచివాలయం, మున్సిపల్ శాఖల ఉద్యోగుల నెల జీతాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆరో విడత ఫీవర్ సర్వేలో ఆయా మండలాల్లో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా, ఈ ఉద్యోగుల వేతనాలను నిలుపుదల చేయడానికి విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపైనా ఇదే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. జీతాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీని ఆదేశించారు.