శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:19 IST)

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. డీఏ ప్రకటిస్తాం.. అది వేతనానికి యాడ్ కాదు..

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు డియర్‌నెస్ అలవెన్స్ డీఏను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. 2021 జూన్ వరకు ఇది నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే ఈ నిర్ణయం వెల్లడించేటప్పుడే.. కేంద్ర ప్రభుత్వం మరో విషయాన్ని చెప్పింది.

టైమ్ ప్రకారం డీఏను ప్రకటిస్తూనే వస్తామని, అయితే ఇది వేతనానికి యాడ్ కాదని స్పష్టం చేసింది. అంటే జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ ఇన్‌స్టాల్‌మెంట్లు అన్నీ వచ్చి చేరతాయి. 
 
2020 జనవరి నుంచి జూన్, 2020 జూలై నుంచి డిసెంబర్, 2021 జనవరి నుంచి జూన్ వరకు అంటే మూడు విడతల డీఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనానికి వచ్చి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ, డీఏ ప్రాతిపదికన ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ డీఏ పెరిగితే.. తద్వారా పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా పైకి చేరుతుంది. దీంతో దీర్ఘకాలంలో పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
 
ఇందులో భాగంగా మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏను పరిగణలోకి తీసుకుంటే.. ఉద్యోగులకు డీఏ 28 శాతానికి చేరే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉద్యోగులకు 17 శాతం డీఏ లభిస్తోంది. డీఏ పెరగడం వల్ల పీఎఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దీంతో పీఎఫ్ అమౌంట్‌పై వచ్చే వడ్డీ కూడా పెరుగుతుంది. దీంతో పీఎఫ్ ఖాతాదారుల చేతికి రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి.