బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (14:14 IST)

'తలకు పిలక... చేతిలో చిడతలు... ఓం నమో నారా' అంటూ ఎంపీ నిరసన

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్ సహజంగానే ఓ నటుడు. అలాంటి ఆయనకు నటించే అవకాశం వస్తే వదులుకుంటారా? పార్లమెంట్ వేదిగా టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలో భాగంగా, శివప్రసాద్ విచిత్ర వ

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్ సహజంగానే ఓ నటుడు. అలాంటి ఆయనకు నటించే అవకాశం వస్తే వదులుకుంటారా? పార్లమెంట్ వేదిగా టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలో భాగంగా, శివప్రసాద్ విచిత్ర వేషధారణలో కనిపించారు. 
 
తలకు వెంట్రుకలకు పిలక వేసుకుని, దానికో రిబ్బన్ కట్టుకుని, మెడలో పూలమాల, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, చేతిలో చిడతలు పట్టుకుని పార్లమెంట్‌కు వచ్చిన ఆయన ఆ తర్వాత పార్లమెంట్ వెలుపలకు వచ్చి పాటలు పాడుతూ నిరసన తెలిపారు. 
 
మరోవైపు, టీడీపీ సభ్యులంతా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతుంటే, "ఓం నమో నారా" అంటూ శివప్రసాద్ అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేశారు. ఏపీకి జరిగిన నష్టాన్ని వెంటనే పూడ్చాలని, తమ డిమాండ్లను బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చాలని కోరుతూ వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.