శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : సోమవారం, 15 మే 2017 (13:19 IST)

అమెరికాలో రోడ్డుప్రమాదం - చిత్తూరు జిల్లా విద్యార్థి దుర్మరణం

అమెరికాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్.పురంకు చెందిన చంద్రశేఖర్, సుహాసిని కుమారుడు సాయికుమార్ మృతి చెందాడు. అమెరికాలోని డెక్లాబ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఆగి

అమెరికాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్.పురంకు చెందిన చంద్రశేఖర్, సుహాసిని కుమారుడు సాయికుమార్ మృతి చెందాడు. అమెరికాలోని డెక్లాబ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును లారీ ఢీకొనడంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
సాయి అమెరికాలో ఎం.ఎస్. చదువుతున్నాడు. సాయి కుమార్ మృతిని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఒక్కసారిగా కుప్పుకూలిపోయారు. సాయి కుమార్ ఇంటి వద్ద విషాధ చాయలు అలుముకున్నాయి. గురువారానికి సాయంత్రానికి సాయి మృతదేహం స్వగ్రామానికి చేరుకోనుంది. 
 
కాగా, ఎమ్మెల్సీ గాలిముద్దుక్రిష్ణమనాయుడు సాయి కుమార్ కుటుంబాన్ని పరామర్శించి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వమే స్వయంగా సాయి మృతదేహానికి స్వగ్రామానికి తీసుకువస్తోందని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్‌ సాయికుమార్ కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు.