గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (18:29 IST)

వైకాపా రాజ్యసభ సభ్యుల పేర్లను ఖరారు చేసిన సీఎం జగన్

ysjagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డితో ఆయన కీలక సమావేశం నిర్వహించి ఈ పేర్లను ఖరారు చేశారు. 
 
ఆ నలుగురు సభ్యుల్లో ఒకరు విజయసాయి రెడ్డి, అడ్వకేట్ నిరంజన్ రెడ్డిలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావును సభకు పంపి జగన్‌ తన హామీని నెరవేర్చనున్నారు. మిగిలిన ఒకరు జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యలు ఉన్నారు.