తిరుపతిలో అధికారులకు సిఎం జగన్ సీరియస్ వార్నింగ్..?
అసలే నివర్ తుఫాన్. లక్షల ఎకరాల్లో పంట నష్టం. లేవలేని పరిస్థితుల్లో రైతులు. లబోదిబోమంటూ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సిఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి వేదికగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు.
అంతకుముందు ఏరియల్ సర్వే ద్వారా మూడు జిల్లాల్లో వరద పరిస్థితిని స్వయంగా చూశారు. ఆ తరువాత అధికారులతో మాట్లాడారు. కానీ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేలా ముఖ్యమంత్రి తన ప్రసంగం సాగింది.
వరద బాధితులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు. ప్రభుత్వం నుంచి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. అయితే మీరిచ్చే నివేదిక మాత్రం కరెక్టుగా ఉండాలి. డిసెంబర్ 15వ తేదీ లోగా ఆ నివేదికను సమర్పించండి.
మళ్ళీ చెబుతున్నా రైతుల కన్నీళ్లను తుడిచే బాధ్యత మనదే. నేరుగా వారి అకౌంట్లలోకే డబ్బులు వేస్తున్నాం. నష్టపోయిన వారి వివరాలు ఎంత నష్టపోయారన్న విషయాన్ని స్పష్టంగా నివేదిక ఇవ్వండి అంటూ సిఎం అధికారులను ఆదేశించారు. వరద బాధితులందరికీ డిసెంబర్ 31వ తేదీలోగా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది.