శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (21:55 IST)

వక్ఫ్ భూములను కాపాడండి.. జగన్ ఆదేశాలు

వక్ఫ్ భూములను కాపాడేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా.. భూముల చట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు. 
 
జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ ఆస్తుల సర్వే కూడా చేపట్టాలని చెప్పారు. అలాగే మైనార్టీల అవసరాలకు తగ్గట్టుగా కొత్త స్మశానాల నిర్మాణాలను చేపట్టాలని సీఎం ఆదేశించారు. మైనార్టీల సబ్ ప్లాన్ కోసం రూపొందించిన ప్రతిపాదనలపై తగిన చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారు. ఇమామ్ లు, మౌజంలు, పాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలను చెల్లించాలని అన్నారు. 
 
గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో హజ్ హౌస్ ల నిర్మాణానికి జగన్ ఆమోదం తెలిపారు. దీనికి తోడు… అసంపూర్ణంగా ఉన్న క్రిస్టియర్ భవన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీకి ప్రాధాన్యతనిచ్చి పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. షాదీఖానాల నిర్వహణను ఇక నుంచి మైనార్టీ శాఖకు బదిలీ చేయాలని తెలిపారు. ఇక కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.