ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (22:38 IST)

ప్రకాశం జిల్లాలో 24న ఏపీ సీఎం జగన్ పర్యటన

ys jagan
ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో 24న పర్యటించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10:35 గంటలకు చీమకుర్తి చేరుకోనున్నారు. 
 
ఉదయం 10:55 గంటలకు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి కళ్యాణమండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.
 
అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:40 గంటలకు తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.