సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (08:12 IST)

అక్టోబర్ 23న పూజకు ముహూర్తం.. దసరా నాటికి సీఎం కార్యాలయం మార్పు

jagan
దసరా నాటికి విశాఖకు సీఎం కార్యాలయం మార్చేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న విశాఖలో క్యాంపు కార్యాలయం పూజకు ముహూర్తం బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. 
 
ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయం ఏదీ ఇంకా తీసుకోలేదని స్పష్టం అయ్యింది. విశాఖలో ఏర్పాట్లు ఓ కొలిక్కి రావడంపై సీఎం షెడ్యూల్ ఆధారపడి ఉంటుందని టాక్ వస్తోంది. 
 
అక్టోబర్ మొదటి వారంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం వుంది. అక్టోబర్ 23న కొత్త కార్యాలయం పూజకు సీఎం వెళ్లే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాల సమాచారం