1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 8 నవంబరు 2016 (15:18 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోస్టల్‌ ఎకనమిక్‌ జోన్‌

అమరావతి : రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే పరిణామానికి అడుగులు పడుతున్నాయి. సింగపూర్‌, మలేషియా తదితర దేశాలకు దగ్గరగా ఏపీ ఉండటం, రాష్ట్రానికి పొడవైన తీరం ఉండటంతో సముద్ర రవాణాకు ఏపీ అత్యంత కీలక ప్రాంతంగా ఉంది. దీంతో, దేశంలోని తూర్పుతీర ప్రాంతంలో ఏర్

అమరావతి : రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే పరిణామానికి అడుగులు పడుతున్నాయి. సింగపూర్‌, మలేషియా తదితర దేశాలకు దగ్గరగా ఏపీ ఉండటం, రాష్ట్రానికి పొడవైన తీరం ఉండటంతో సముద్ర రవాణాకు ఏపీ అత్యంత కీలక ప్రాంతంగా ఉంది. దీంతో, దేశంలోని తూర్పుతీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్‌కు కూడా రాష్ట్రమే కీలకం కానుంది. ఈ జోన్‌ను అటు ఒడిసా నుంచి ఏపీ వరకూ, లేకుంటే ఏపీ నుంచి చెన్నై వరకూ ఎటు ఏర్పాటు చేసినా ఏపీ భాగస్వామ్యం అనివార్యం.
 
ఈ జోన్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. దీనికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా ఈరోజు విజయవాడ గేట్ వే హోటల్‌కు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఒక ప్రజెంటేషన్‌ను పనగారియా ఇవ్వనున్నారు. 
 
తీరప్రాంత జోన్‌ ఏర్పాటుకోసం రాష్ట్రం చేయాల్సిన పనులేంటి? కేంద్ర సాయం తదితర అంశాలపై చర్చలుంటాయి. తీరప్రాంతంలో పరిశ్రమలకు అవసరమైన రాయితీలు ఇచ్చి వాటి ఉత్పత్తులను ఎగుమతి చేసే ఆలోచనతో ప్రభుత్వాలున్నాయి. వీటన్నింటికీ కార్యరూపం ఇచ్చే దిశగా సీఎంతో పనగారియా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.