కరువు ప్రాంతం నుంచి వచ్చా, 365 రోజులు ఇక్కడ వాన చినుకులు: రఘువీరా video పోస్ట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ రఘువీరా రెడ్డి ప్రకృతి అందాల మధ్య పర్యటిస్తున్నారు. అసోం రాష్ట్రం లోని చిరపుంజిలో ఏటా వర్షం కురుస్తూనే వుంటుంది. ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రఘువీరా తన అనుభవాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు.
ట్విట్టర్ ద్వారా తెలుపుతూ... కరువు ప్రాంతంలో పుట్టాను. ఐతే 365 రోజులు వర్షాలు కురిసే చిరపుంజిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇప్పుడు కూడా సన్నని చినుకులు పడుతున్నాయి. ఇలా కురిసిన వర్షపు నీరంతా మన దేశం నుంచి అదిగో ఆ కొండల అవతల నుంచి సరిహద్దు ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. అక్కడివారికి సిరులు కురుపిస్తుంది. ఇట్లాగే ఆ వరుణ దేవుడు కూడా మన రాయలసీమ ప్రాంతానికి వర్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని రాసారు.