మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (09:32 IST)

ఏపీలో ఒంటరిగానే పోటీ... 175 సీట్లకు కార్యాచరణ : ఊమెన్ చాందీ

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ ఇపుడు మెల్లగా మళ్లీ పుంజుకుంటోంది. ప్రత్యేక హోదాతో పాటు.. విభజన హామీల అమలులో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ ఇపుడు మెల్లగా మళ్లీ పుంజుకుంటోంది. ప్రత్యేక హోదాతో పాటు.. విభజన హామీల అమలులో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు తీవ్ర మోసం చేసింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్రంలో పుంజుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులోభాగంగా, ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను తప్పించి.. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని నియమించారు. ఈయన రాష్ట్రంలో తరచూ పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల అంశంలో తమ పార్టీ కట్టుబడివుందని తెలిపారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. పైగా, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. 
 
తమ పొత్తు ప్రజలతోనేనని... కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇచ్చిన హామీలు నెరవేర్చగలదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో విపక్షం విఫలమైందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ... ఏపీకి ఐదేళ్లు హోదా ఇస్తామంటే... బీజేపీ పదేళ్లు కావాలని అడిగిందని... ఈరోజు అధికారంలో ఉండి చేసిందేమిటి? అని ప్రశ్నించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మదనపల్లెలో సుధాకర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమైన విషయమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎందుకు సరైన దృష్టి పెట్టడంలేదని ప్రశ్నించిన ఆయన... బీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా... అధికారం కోసమే ఆరాట పడుతున్నాయని మండిపడ్డారు.