గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (11:41 IST)

ఏపీలో తగ్గని కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా 115 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మంగళవారం 115 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3,791కు చేరుకుందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 
 
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లదేదు. శాంపిల్స్‌ను పరీక్షించగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 33 మందికి కరోనా సోకింది. 
 
గత 24 గంటలుగా రాష్ట్రంలో ఎలాంటి కరోనా మృతులు నమోదు కాలేదు. 40 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ 2209 మంది డిశ్చార్జ్ అయ్యారు.