శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (12:02 IST)

ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా

ప్రకాశం  జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 113కు చేరింది.

నిన్న కందుకూరు, పొదిలికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం  41,770  శ్యాంపిళ్లు పంపగా అందులో 39,112 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి.

ఇంకా 2545 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో  682 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 66 మంది డిశ్చార్జ్ అవగా...జిల్లాలో ప్రస్తుతం 47 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.