సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (11:58 IST)

మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా పాజిటివ్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన వెల్లడించారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని, అందువల్ల తనను కలసినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
అదేసమయంలో ప్రస్తుతం తానిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇపుడు ఇంట్లోనే హోమ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్సను పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 
 
ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, సోమిరెడ్డి గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయనకు మహమ్మారి సోకినట్టు తెలుస్తోంది. 
 
కాగా, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీనియర్ నేతల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు. ఈయన పార్టీకి, కార్యకర్తలకు ఎంతో అండగా ఉంటున్నారు. ఇపుడు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.