మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (17:09 IST)

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ: కొత్తగా 840 కేసులు, ఒకరు మృతి

ఏపీలో కరోనా వైరస్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. కొత్తగా 840 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. విశాఖ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. తాజాగా.. మరో 133 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 37,849 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,972 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
 
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వారికి మొదటి డోసు వ్యాక్సిన్‌ పంపిణీలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. మూడు రోజుల్లోనే 52.82 శాతం మందికి టీకాలు పూర్తి చేసింది.